- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బియ్యం గింజ కంటే చిన్నదైన పేస్‌మేకర్..!
ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీర్లు సిరంజి ద్వారా శరీరంలోకి ఇంజెక్ట్ చేయగల 'ప్రపంచంలోనే అతి చిన్న' పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేశారు.

దిశ తెలంగాణ బ్యూరో: ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీర్లు సిరంజి ద్వారా శరీరంలోకి ఇంజెక్ట్ చేయగల 'ప్రపంచంలోనే అతి చిన్న' పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేశారు.అన్ని వయస్సుల వారికి పనిచేయగల సామర్థ్యం ఉన్న ఈ పేస్‌మేకర్ పుట్టుకతో వచ్చే గుండె లోపాలున్న నవజాత శిశువుల సున్నితమైన హృదయాలకు ప్రత్యేకంగా సరిపోతుంది. ఒక బియ్యం గింజ కంటే చిన్నదిగా ఉన్న ఈ పేస్‌మేకర్, రోగి ఛాతీకి అనుసంధానించే చిన్న వైర్‌లెస్ పరికరంతో పాటు పని చేస్తుంది.
హృదయ స్పందన సరిగ్గా లేదని గుర్తించిన వెంటనే వైర్‌లెస్ పరికరం పేస్‌మేకర్‌ను ఆక్టివ్ చేయడానికి కాంతి పల్స్‌ను విడుదల చేస్తుంది. ఈ పల్స్‌లు చర్మం, రొమ్ము ఎముక , కండరాలలోకి చొచ్చుకుపోయి గుండె లయను నియంత్రిస్తాయి. ఈ పేస్‌మేకర్ గాల్వానిక్ సెల్ ద్వారా పనిచేస్తుంది. అయితే తాత్కాలిక ఉపయోగం కోసం రూపొందించబడిన ఈ పేస్‌మేకర్ అవసరం తీరాక సహజంగానే శరీరంలో కరిగిపోతుంది. బయో కాంపాజిబుల్‌గా ఉన్న ఈ పరికరం శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా విచ్ఛిన్నమవుతుంది..దీంతో శస్త్రచికిత్స అవసరం కూడా ఉండదు.






