- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.30 వేల శారీ కట్టుకోని అందంగా ముస్తాబై వస్తారు.. కానీ ప్రైవేట్ పార్ట్ మాత్రం గబ్బు గబ్బు! డాక్టర్ కామెంట్స్ వైరల్
మహిళల వ్యక్తిగత శుభ్రతపై ఓ డాక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : మహిళల వ్యక్తిగత శుభ్రతపై ఓ డాక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో గైనకాలాజిస్ట్ అయిన ఆమె మహిళల ప్రైవేట్ పార్ట్ శుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘రూ.30 వేలకు పైగా విలువైన చీరలు కట్టుకోని అందంగా ముస్తాబై తన దగ్గరకు వస్తారు. కానీ వాళ్ల ప్రైవేట్ పార్ట్ చూస్తే కంపుకొడతాయి. తీవ్ర దుర్ఘంధం వస్తాయి. పైన ఉందంగా కనిపించడం కాదు.. మీ ప్రైవేట్ పార్ట్ కూడా మీ శరీరంలో భాగమే అని గుర్తించండి. అది అంటరాని పార్ట్ కాదు. టాయిలెట్ వెళ్లినప్పుడు, స్నానం చేసే సమయంలో ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి. పురుషులతో పోల్చితే మహిళలకు టాయిలెట్ ద్వారా ఎక్కువ ఇన్‌ఫెక్షన్లు చోకే అవకాశం ఉంది. అందుకే మహిళలకు ప్రైవేట్ పార్ట్ శుభ్రత అనేది అతిముఖ్యమైనదిగా భావించాలి. ముఖ్యంగా మోషన్ వెళ్లినప్పుడు పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చిన్నపాటి మలం ఉన్నా బాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి’’ అంటూ ఆ వైద్యురాలు వివరించింది.
అయితే మహిళల ప్రైవేట్ పార్ట్ శుభ్రతపై మాట్లాడిన సదరు వైద్యురాలిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ మహిళా వైద్యురాలు అయ్యుండి ఇంత దారుణంగా మాట్లాడుతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ తంబినెల్‌ను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం పైన పటారం.. లోన లొటారం అంటూ కామెంట్ చేస్తున్నారు. పైకి అందంగా కనిపిస్తే సరిపోతుందా..? వ్యక్తిగత శుభ్రత పాటించాలి కదా! వీళ్ల అపరిశుభ్రత వల్ల భర్తలకు కూడా వైరస్ సంక్రమిస్తాయి అంటూ డాక్టర్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






