కార్తీకమాసంలో ఆరోగ్యాన్ని అందించే సిరి.. ఉసిరి

by  |
కార్తీకమాసంలో ఆరోగ్యాన్ని అందించే సిరి.. ఉసిరి
X

దిశ, వెబ్‌డెస్క్ : కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అప్పుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చి తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దలు నమ్ముతారు.

కార్తికమాసం వచ్చిందంటే చాలు.. వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అని పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు.. ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అని పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.

ఉసిరి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఉప్పులో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిషశాస్త్రం,వాస్తుశాస్త్రం చెప్తున్నాయి. ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లో నూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగు వ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.


Next Story

Most Viewed