Health tips: చిలకడ దుంపల వల్ల లాభాలెన్నో తెలుసా..?

by  |
Health tips: చిలకడ దుంపల వల్ల లాభాలెన్నో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: చిలకడ దుంప(sweet potato)ల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. చిలకడ దుంపలు శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు(Nutrients) అందించడంతో పాటు విష పదార్థాలను తొలగిస్తుంది. వీటిని ఆవిరిపై ఉడికించుకునో, ఉడికించుకునో, కూర వండుకునో తింటారు. వీటిని వారంలో రెండు, మూడు సార్లు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

మార్కెట్లో తక్కువ ధరకే దొరికే చిలకడ దుంపలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు(Carbohydrates), విటమిన్ బి, సి, ఇ తో పాటు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కార్టినాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విష రసాయనాలను బయటకు పంపిస్తుంది. చిలగడ దుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

చిలగడ దుంపల్లో విటమిన్‌ ఎ, బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక చిలగడ దుంపల్లో విటమిన్‌ బీ6 సమృద్ధిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేలా తయారు చేస్తాయి. చిలకడ దుంపలు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తుంది. అలాగే రక్తంలోని గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడుతాయి.

చిలకడ దుంపల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి ఇన్‌ఫెక్షన్లు, వైరస్ వంటి క్రిములు ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. క్యాన్సర్ కణాలను అణచివేయడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. చిలకడ దుంపలు విటమిన్‌ ఈ అధికంగా ఉంటుంది. ఇది మన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతగా మెరిసేలా చేస్తుంది. చిలకడ దుంపల్లో ఉండే పాంథోనిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది.


Next Story

Most Viewed