పోషకాలు మెండుగా ఉండే మొక్కజొన్న

by  |
పోషకాలు మెండుగా ఉండే మొక్కజొన్న
X

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో మొక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. వర్షం పడుతున్నప్పుడు నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను తినడంలో ఆ మజానే వేరు. మెుక్కజొన్న గింజల నుంచి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారు చేస్తారు. మొక్కజొన్న శరీరానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు అవెంటో తెలుసుకుందాం..

వరి, గోధుమ లాగే మొక్కజొన్న కూడా ఆహార పంటల్లో ఒకటి. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మొక్కజొన్న కొలెస్ట్రాల్‌ స్ఠాయుల్ని తగ్గించడంతో పాటు వ్యాధులపై పోరాడే శక్తిని పెంపొందిస్తుంది. మొక్కజొన్నలో ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నిషీయం, ఐరన్, కాపర్, ఫాస్పరస్‌లు ఎముకలను గట్టిపరుస్తాయి.

గర్భిణీలు మొక్కజొన్నలకు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భిణులకు కాళ్లు, చేతులు వాపురాకుండా చేస్తాయి. మొక్కజొన్నను తగిన మోతాదులో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఇక కిడ్నీకి సంబంధించిన వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. మొక్కొజొన్నను తీసుకోవడం ద్వారా కార్డియోవాస్కులర్ హెల్త్ కు ఎంతో మంచింది. అంతే కాకుండా దీనిలో ఉండే బీటా క్రిస్టాక్సన్తిన్ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మొక్కజొన్న గింజల నూనెను చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది. మొక్కజొన్నలను తినడం వల్ల హెయిర్ ఫోలీ సెల్స్ కు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలో విటమిన్ సి, లైకోపిన్ సమృద్దిగా ఉంటాయి. దీంతో హెయిర్ మృదువుగా మారడంతో పాటు మంచి షైనింగ్ వస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మొక్కజొన్న ఆహార పదార్ధాలను తరచూ తీసుకోవడం ద్వారా ఎంతో మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

పుదీనాతో బెనిఫిట్స్..


Next Story

Most Viewed