చాక్లెట్స్ ఎక్కువగా తింటున్నారా..?

232

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాక్లెట్స్‌ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. చిన్న పిల్లలు ఏడుస్తుంటే వారికి చాక్లెట్ ఇస్తే చాలు ఏడుపు మానేస్తుంటారు. ఫ్రెండ్స్ అయినా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులు అయినా శుభాకాంక్షలు, అభినందనలు తెలపాలంటే చాక్లెట్స్‌ను ఇస్తుంటారు. ఈ చాక్లెట్స్ తినడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

చాక్లెట్స్‌లో సైతం అనేక రకాలు ఉంటాయి. వీటిలో డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ చాక్లెట్ల కంటే 60- 70 శాతం కోకోతో తయారైన నల్లని, కొద్దిగా చేదుగా, కోకో వాసనతో ఉండే డార్క్ చాక్లెట్లు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దోహదపడతాయి. ఇవి ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరంలోని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది.

డార్క్ చాక్లెట్స్‌ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్ సమృద్ధిగా అందుతాయి. గర్భిణీలు డార్క్ చాక్లెట్స్ తింటే తల్లి, బిడ్డకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ చాక్లెట్స్ తినడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ చాక్లెట్లను తింటే లోబీపీ దరి జేరదు. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అదే విధంగా రక్తం గడ్డకట్టకుండా, ధమనులు గట్టిపడకుండా చూసుకుంటుంది.

డార్క్ చాక్లెట్లు చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. పలు దేశాల్లో చాక్లెట్ పేస్ ప్యాక్ వినియోగిస్తుంటారు. ఇవి చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. డార్క్ చాక్లెట్‌ను తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి.. చురుగ్గా చురుగ్గా పనిచేయగలుగుతారని ఓ పరిశోధనలో తేలింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..