మళ్లీ నష్టపోయిన మార్కెట్లు

by  |
మళ్లీ నష్టపోయిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Domestic equity markets) మళ్లీ కుదేలయ్యాయి. రోజంతా ఆటుపోట్లకు గురైన సూచీలు చివరికి భారీ పతనాన్ని చూశాయి. అమెరికా మార్కెట్ల పతనంతో పాటు, యూరప్ దేశాల్లో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటం, అమెరికా ఆర్థిక ప్యాకేజీపై అనిశ్చితి వంటి పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదుడుకులు మదుపర్ల(investors)లో ఆందోళనలకు కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధానంగా బ్యాంకింగ్ రంగం షేర్లు కుప్పకూలడంతో సెన్సెక్స్(Sensex) 40 వేల దిగువకు చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 599.64 పాయింట్లు కుప్పకూలి 39,922 వద్ద ముగియగా, నిఫ్టీ(Nifty) 159.80 పాయింట్లు నష్టపోయి 11,729 వద్ద ముగిసింది. నిఫ్టీలో కీలక రంగాలన్నీ 1 శాతానికిపైగా డీలాపడగా, ఆటో రంగం స్వల్పంగా నష్టపోయింది. రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు 2 శాతం వరకు డీలాపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌(Sensex Index)లో భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, ఎల్అండ్‌టీ షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేయగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ షేర్లు అధికంగా నష్టాలను నమోదు చేశాయి.



Next Story

Most Viewed