ఆస్ట్రేలియా ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చేతికి!

by  |
ఆస్ట్రేలియా ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చేతికి!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆస్ట్రేలియా ఐటీ సర్వీసుల దిగ్గజ సంస్థ డీడబ్ల్యూఎస్‌ను కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తి చేసినట్టు ప్రకటించింది. మంగళవారంతో డీడబ్ల్యూఎస్ పూర్తిస్థాయి కార్యకలాపాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చేతిలోకి వచ్చినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డీడబ్ల్యూఎస్ సంస్థ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐటీ సేవలను అందిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లోనే డీడబ్ల్యూఎస్ సంస్థను కొనుగోలు చేయనున్నట్టు హెచ్‌సీఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం విలువ 158.2 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు రూ. 893 కోట్లు). డీడబ్ల్యూఎస్ కంపెనీ కొనుగోలు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మంగళవారం హెచ్‌సీఎల్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. హెచ్‌సీఎల్ షేర్ ధర రూ. 992.50 వద్ద ర్యాలీ చేసింది.


Next Story

Most Viewed