ఉస్తాద్.. నిన్ను మిస్ అవుతున్నా : ఛార్మి

by  |
ఉస్తాద్.. నిన్ను మిస్ అవుతున్నా : ఛార్మి
X

దిశ, సినిమా : ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌, మైండ్ బ్లోయింగ్ స్టెప్స్‌, ఐకానిక్ లుక్స్‌తో ప్రతీ సినిమాకు వైవిధ్యాన్ని చూపే హీరో రామ్ పోతినేని.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 33 సంవ్సతరంలోకి అడుగుపెట్టిన ఇస్మార్ట్ హీరోకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లు వెత్తుతుండగా.. #RAmPOthineni, #HBD#RAmPOthineni ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ క్రమంలోనే రామ్‌కు స్వీట్ బర్త్‌డే విషెస్ తెలియజేసిన హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్..

ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ పార్టీ నుంచి త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు ‘ఉస్తాద్.. వీ మిస్ యూ.. మన ఇస్మార్ట్ శంకర్ మూవీ మ్యాజిక్‌ను ఎప్పటికీ మరిచిపోలేం.. చాలా సరదాగా గడిచిపోయింది.. హ్యాపీ బర్త్‌డే, త్వరలోనే మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్‌’లో రామ్ పర్ఫార్మెన్స్‌పై గొప్పగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక రామ్ తన నెక్ట్స్ సినిమాను తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story