టీ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్..

122
harshavardan reddy

దిశ, తెలంగాణ బ్యూరో : టీ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం పార్టీని వీడగా… తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్​ ఆశించి భంగపడిన హర్షవర్ధన్​రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌ను, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి చిన్నారెడ్డిని అభ్యర్థులుగా అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీ చేయాలని హర్షవర్ధన్‌రెడ్డి అనుకున్నారు. అయితే అధిష్టానం చిన్నారెడ్డికి గ్రీన్ సిగ్నలిచ్చింది. దీంతో హైదరాబాద్‌ స్థానంపై ఆశలు పెట్టుకున్న హర్షవర్ధన్‌రెడ్డి రెబెల్‌గా బరిలోకి దిగుతున్నారు. పార్టీ నేతలు వద్దని వారించినా ఆయన పోటీకే మొగ్గు చూపారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హర్షవర్ధన్​రెడ్డి ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..