డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

by Shyam |

<p>దిశ ప్రతినిధి, మెదక్ : తాను ఏ హోటల్ యజమాని వద్ద డబ్బులు తీసుకోలేదని, తీసుకున్నట్టు నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమని సిద్దిపేట మున్సిపాలిటీ హరితహారం ప్రత్యేకాధికారి సామల్ల ఐలయ్య అన్నారు. సిద్దిపేటలో మున్సిపల్ అధికారుల ఆగడాలు.. భగ్గుమన్న వ్యాపారులు అనే కథనాన్ని ‘దిశ’లో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. దీనికి స్పందించిన హరితహారం ప్రత్యేకాధికారి ‘దిశ’ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధితో మాట్లాడారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తన డ్యూటీలో కాంప్రమైజ్ కానని, [&hellip;]</p>

ilaiah
X

దిశ ప్రతినిధి, మెదక్ : తాను ఏ హోటల్ యజమాని వద్ద డబ్బులు తీసుకోలేదని, తీసుకున్నట్టు నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమని సిద్దిపేట మున్సిపాలిటీ హరితహారం ప్రత్యేకాధికారి సామల్ల ఐలయ్య అన్నారు. సిద్దిపేటలో మున్సిపల్ అధికారుల ఆగడాలు.. భగ్గుమన్న వ్యాపారులు అనే కథనాన్ని ‘దిశ’లో ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. దీనికి స్పందించిన హరితహారం ప్రత్యేకాధికారి ‘దిశ’ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధితో మాట్లాడారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తన డ్యూటీలో కాంప్రమైజ్ కానని, సిద్దిపేట ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. ఏ హోటల్లో టీ తాగిన, బిర్యానీ తిన్న ప్రతిదానికీ డబ్బులు చెల్లించానని, నిబంధనలు అతిక్రమించిన హోటల్ యజమానికి జరిమానా విధించానే తప్ప ఎక్కడా కూడా వారి వద్ద డబ్బులు అడగలేదని చెప్పారు. తప్పు చేస్తే తలవంచుకుంటానని, నిక్కంగా పనిచేస్తున్న, సిద్దిపేట ప్రజల కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధమని చెప్పారు. ఇప్పటివరకు తనది 36 ఏళ్ల సర్వీస్ అని, తాను ఎవరికీ హాని కలిగించలేదన్నారు.

Next Story