చిట్టితల్లికి న్యాయం జరగాలంటే ఆయన రావాల్సిందే..!

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-13 05:35:44  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన పై ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ‘దిశ’ హత్యాచార ఘటనను కొద్ది రోజుల్లోనే క్లోజ్ చేసిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్‌కు ఈ కేసును అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ [&hellip;]</p>

చిట్టితల్లికి న్యాయం జరగాలంటే ఆయన రావాల్సిందే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన పై ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ‘దిశ’ హత్యాచార ఘటనను కొద్ది రోజుల్లోనే క్లోజ్ చేసిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్‌కు ఈ కేసును అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్‎లో ‘‘We need Sajjanaar sir to handle this .. Instant justice is Needed or else it won’t stop and don’t wanna spread this news as there is a danger of other perverted minds to get inspired through the news !!! Frustrated and helpless …. matter reached to @KTRTRS let’s hope the best’’ అని ఉంది.

అంటే ఈ కేసుపై తక్షణ పరిష్కారం జరగాలంటే సజ్జనార్ సార్‌కు కేసును అప్పజెప్పాలని కోరారు. లేకపోతే ఇలాంటి వాటిని చూసి మరింత మంది ప్రేరణ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆలోచించాలన్నారు. ఇది ఇలా ఉంటే ట్వీట్‌కి స్పందిస్తున్న నెటిజన్లు సజ్జనార్ మాత్రమే న్యాయం చేయగలరంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story