ఈటలపై వార్‌.. భారీ స్కెచ్ వేసిన ట్రబుల్ షూటర్

by  |
ఈటలపై వార్‌.. భారీ స్కెచ్ వేసిన ట్రబుల్ షూటర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: క్షేత్ర స్థాయిలో సూక్ష్మ పరిశీలనపై ట్రబుల్ షూటర్ ప్రత్యేక దృష్టి సారించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీపై ప్రభావితం చేసే అంశాలు, ప్రత్యర్థి పార్టీకి ఉన్న ప్లస్‌లు ఏంటీ అన్న వివరాలు సేకరించే పనిలో పడ్డారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేటలో సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి హరీష్ పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఏయో వార్డుల్లో పార్టీ బలహీనంగా ఉంది, ఇందుకు కారణాలు ఏంటీ, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న విషయాలపై కులంకుశంగా చర్చించారు మంత్రి హరీష్. ఆయా స్థానాల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగాల్సి ఉంటుందో హుజురాబాద్ కేడర్‌కు వివరించారు. మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పని చేయాలని, హంగు ఆర్భాటాల కన్నా ఓటర్లను పార్టీకి అనుకూలంగా మల్చుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావుతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ బాధ్యులు హాజరయ్యారు.


Next Story

Most Viewed