స్కూల్‌కెళ్లిన మంత్రి.. టీచర్లు ఎక్కడ ?

by  |

దిశ, సిద్దిపేట: పాఠశాలలను పున:ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా నగునూరు మండలం ముండ్రాయిలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయానికి పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉపాధ్యాయుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణ ప్రాంగణం బురదమయంగా మారిందని, మొరం పోయించి చదును చేయించాలని, ఆలస్యంగా వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజను ఆదేశించారు.

పాఠశాలలు ప్రారంభం దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలు, తరగతుల నిర్వహణ, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను మంత్రి ఆరా తీశారు. పాఠశాలకు వచ్చే విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా, లేవా అంటూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కరోనా నేపథ్యంలో పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టి, తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఏంసీ ఎడ్ల సోమిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed