రాష్ట్రానికి రూ.723 కోట్ల నష్టం : హరీశ్ రావు

by  |
రాష్ట్రానికి రూ.723 కోట్ల నష్టం : హరీశ్ రావు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల రేట్లను పెంచాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ చర్చించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ… ‘ఆర్థిక సంఘం సిఫార్సులను పూర్తిగా అమలు చేయట్లేదు.

2020-21లో రాష్ట్రానికి రూ.723 కోట్ల నష్టం వచ్చింది. రాష్ట్రం నష్టపోయిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. సెస్,సర్ ఛార్జీలను రద్దు చేయాలి. వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి రూ.900 కోట్లు విడుదల చేయాలి. ఎన్నో ఏండ్ల నుంచి పింఛన్లకు కేంద్రం రెండు వందలే ఇస్తోంది. పింఛన్లకు కేంద్రం రూ.వేయి ఇవ్వాలి. జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే విడుదల చేయాలి’ అని అన్నారు.


Next Story