T20 World Cup: భారీ ప్లాన్ వేసిన హార్దిక్ పాండ్యా

by  |
T20 World Cup: భారీ ప్లాన్ వేసిన హార్దిక్ పాండ్యా
X

దిశ, వెబ్‌డెస్క్: టీ 20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని జట్లు సమాయత్తం అవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌‌ లైనప్‌లను ఆయా దేశాల క్రికెట్ బోర్డు‌లు ఇప్పటినుంచే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా టీ 20 వరల్డ్ కప్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆల్ రౌండర్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే క్రమంలో బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్‌లో నిరూపించుకోవాలి అని తాజాగా ఓ చానల్‌కు చెప్పాడు. ఫిట్‌నెస్ మీద దృష్టి సారించి.. టీ 20 వరల్డ్ కప్ అన్ని మ్యాచుల్లో బౌలింగ్ చేయాలనుకుంటున్నానని హార్దిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు అన్ని విధాలుగా తనను తాను నిరూపించుకుంటానని ధీమాతో ఉన్నాడు హార్దిక్.


Next Story