హార్దిక్ పాండ్యా త్వరలో బౌలింగ్ చేస్తాడు

by  |
హార్దిక్ పాండ్యా త్వరలో బౌలింగ్ చేస్తాడు
X

దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ జట్టులోని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. అంతకు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయించలేదు. అతడి భుజానికి అయిన గాయం పూర్తిగా మానకపోవడంతోనే బౌలింగ్ చేయించడం లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడని.. త్వరలోనే ముంబై తరపున బౌలింగ్ చేస్తాడని ముంబై జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ జహీర్ ఖాన్ స్పష్టం చేశారు. ‘హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే ఒక ప్యాకేజీ ఉన్నట్లే. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు అద్భుతంగా ఫీల్డింగ్ కూడా చేయగలడు. అయితే అతడి పరిమితులు ఏమిటో మాకు తెలుసు. అందుకే పాండ్యాపై భారం పెట్టదల్చుకోలేదు’ అని జహీర్ ఖాన్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొత్తం 9 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ఫిజియోను సంప్రదించగా కొన్ని రోజలు పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అందుకే ఐపీఎల్‌లో అతడికి బంతిని ఇవ్వడం లేదు. త్వరలోనే పాండ్యా బౌలింగ్ చేస్తాడని జహీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed