తండ్రైన హార్ధిక్ పాండ్యా

by  |
తండ్రైన హార్ధిక్ పాండ్యా
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తండ్రయ్యారు. తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పాండ్యా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. చిన్న బాబు చేయిపట్టుకొని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పాండ్యా.. ‘నటాషా, నేను పండంటి బాబుకు జన్మనిచ్చాం’ అని రాసుకొచ్చాడు. ఈ ఏడాది మే 31న నటాషా గర్భంతో ఉన్నట్లు పాండ్యా ఇన్‌స్టా ద్వారానే తెలియజేశాడు. అప్పటి నుంచి ఆమెతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూనే ఉన్నాడు. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సిన సమయంలో ముందుగానే నటాషా బిడ్డకు జన్మనివ్వడంతో పాండ్యా ఉబ్బితబ్బిబవుతున్నాడు. కాగా, నటాషా స్టాంకోవిక్‌తో కొంతకాలం సహజీవనం చేసిన హార్దిక్ ఈ ఏడాది ఆరంభంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆపై ఇద్దరు పెళ్లిపీటలెక్కారు. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన ‘సత్యాగ్రహ’ చిత్రంతో నటాషా స్టాన్‌కోవిచ్‌ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశారు. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.


Next Story

Most Viewed