- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాన కోచ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
<p>దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇవాళ తన 58వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు క్రికెటర్లు, సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవిశాస్త్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కానీ, అక్కడ పోస్ట్ చేసిన ఫొటో, పెట్టిన క్యాప్షన్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. రవిశాస్త్రి, ధోనీతో కొహ్లీ ఉన్న ఫొటోను పెట్టి.. ”అందరూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు.. కానీ, కొందరే ధైర్యవంతులుగా […]</p>

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇవాళ తన 58వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు క్రికెటర్లు, సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవిశాస్త్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కానీ, అక్కడ పోస్ట్ చేసిన ఫొటో, పెట్టిన క్యాప్షన్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. రవిశాస్త్రి, ధోనీతో కొహ్లీ ఉన్న ఫొటోను పెట్టి.. ”అందరూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు.. కానీ, కొందరే ధైర్యవంతులుగా ఉంటారు. హ్యాపీ బర్త్ డే రవీభాయ్” అని కామెంట్ చేశాడు. తాను ఎంతో ఇష్టపడే రవిశాస్త్రి, ధోనీల ఫొటో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా శాస్త్రికి శుభాకాంక్షలు తెలిపారు. భారత జట్టులోని కేదార్ జాదవ్, శిఖర్ ధావన్‌లు తమ జట్టు కోచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐ రవిశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించింది. ఇక ఐసీసీ కూడా రవిశాస్త్రి గణాంకాలను పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.






