- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోశయ్యను హింసించారు.. సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతతో పాటు తలపండిన నేతగా ఆయనకు పేరుంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో పనిచేసి ఎన్నో పదవులను చేపట్టారు. దీంతో ఆయన మరణంతో కాంగ్రెస్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతతో పాటు తలపండిన నేతగా ఆయనకు పేరుంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో పనిచేసి ఎన్నో పదవులను చేపట్టారు. దీంతో ఆయన మరణంతో కాంగ్రెస్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా హింసించారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదనే బాధ రోశయ్యలో ఎప్పుడూ ఉండేదని, ప్రతి ఒక్కరూ రోశయ్యను ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారు. రోశయ్యను హింసించి బాధ పెట్టారంటూ వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Next Story






