ఇక హన్సిక GIF..

by  |
ఇక హన్సిక GIF..
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వాని… తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్‌లో ‘దేశముదురు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నా… తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న హన్సిక …లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మహ’ సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడగా… ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.

కానీ తన అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెచ్చింది హన్సిక. తన సొంత GIF పొందిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించి.. ఫ్యాన్స్‌కు గ్రేట్ న్యూస్ అందించింది. ప్రస్తుతం హన్సిక GIFలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా… ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎంజాయ్ చేయాలని సూచిస్తోంది. నా ముఖం ద్వారా మీ సన్నిహితుల దగ్గర మీ భావాలని పంచుకోవాలని చెప్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోగా… సో బ్యూటీఫుల్ హన్సిక అంటూ తమ ఫేవరేట్ GIFలు షేర్ చేస్తున్నారు.


Tags: Hansika, GIF, Record, Hansika Motwani



Next Story

Most Viewed