‘2016 ఢాకా అటాక్‌’లో మానవత్వానిదే గెలుపు : హన్సల్ మెహతా

by  |
‘2016 ఢాకా అటాక్‌’లో మానవత్వానిదే గెలుపు : హన్సల్ మెహతా
X

దిశ, సినిమా : డైరెక్టర్ హన్సల్ మెహతా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా, భూషణ్ కుమార్‌లతో కొలాబరేట్ అవుతున్న ఆయన.. ‘జూలై 2016 ఢాకా అటాక్’ బేస్ చేసుకుని మూవీ తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. 2016 జూలై 1న ఓ కేఫ్‌ను చుట్టుముట్టిన ఐదుగురు తీవ్రవాదులు.. 50 మంది సామాన్యులను బంధించి 12 గంటలు చిత్రహింసలు పెట్టిన ఇన్సిడెంట్‌ను చూపించబోతున్నట్లు చెప్పారు.

‘ఫిరాజ్’ టైటిల్ కన్‌ఫర్మ్ కాగా, ఈ మూవీ ద్వారా ఫ్రెష్ టాలెంట్‌ను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు మెహతా. జహన్ కపూర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండగా.. ఆదిత్య రావల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హింసాత్మక ఘటనలో అంతిమంగా మానవత్వం విజయం సాధించిందనేదే స్టోరీ లైన్. మూడేళ్ల నుంచి ఈ కథ హృదయానికి చాలా దగ్గరైందని.. తాను ఇమాజిన్ చేసుకున్న థ్రిల్లింగ్ డ్రామాను నిర్మించేందుకు అనుభవ్ సిన్హా, భూషణ్ కుమార్‌లు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

Next Story

Most Viewed