- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంతి అనుకుని నాటుబాంబుతో ఆడుతుండగా..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : బంతి అనుకుని నాటుబాంబుతో ఆడుతుండగా ప్రమాదవశాత్తు చేతిలో పేలి గాయపడిన విద్యార్థి సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. బాంబు పేలుడులో తొలుత గాయపడిన విద్యార్థి వరకుమార్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రరక్తస్రావం వలన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకివెళితే.. గుర్తు తెలియని దుండగులు స్కూల్ పక్కనే నాటు బాంబులను భద్రపరచారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : బంతి అనుకుని నాటుబాంబుతో ఆడుతుండగా ప్రమాదవశాత్తు చేతిలో పేలి గాయపడిన విద్యార్థి సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. బాంబు పేలుడులో తొలుత గాయపడిన విద్యార్థి వరకుమార్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రరక్తస్రావం వలన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
వివరాల్లోకివెళితే.. గుర్తు తెలియని దుండగులు స్కూల్ పక్కనే నాటు బాంబులను భద్రపరచారు. వాటిని బంతులుగా భావించి ఆడుకున్న విద్యార్థి చేతిలో ప్రమాదవశాత్తు బాంబు పేలింది. తీవ్రగాయాలపాలైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకునే క్రమంలో పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం విద్యార్థి వరకుమార్ తుదిశ్వాస విడిచాడు. వరకుమార్ ఇకలేడనే విషయం తెలియడంతో చెన్నంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






