హ్యాకర్లు రెచ్చిపోతున్నారు : UNO

by  |
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు : UNO
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు రెచ్చిపోతున్నారని, ఈ ఏడాది దాడులు కూడా పెరిగాయాని ఐక్యరాజ్యసమితి (UNO)ఆందోళన వ్యక్తం చేసింది. మొదటి త్రైమాసికంలోనే దాదాపు 350 శాతానికి పైగా ఫిషింగ్ వెబ్‌సైట్ల ద్వారా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం ప్రధానాధికారి వ్లాదిమిర్ వొరొంకోవ్ పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఈ సైబర్ దాడుల్లో అత్యధికంగా ఆస్పత్రులు , ఆరోగ్య సంస్థలపైనే జరుగుతున్నాయని విచారం వ్యక్తంచేశారు.కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, దీని కారణంగానే సైబర్ దాడులు కూడా విపరీతంగా పెరుగాయని వోరొంకోవ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టెర్రరిస్టులు కొత్త వారిని చేర్చుకునేందుకు కూడా ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారాయని, ప్రపంచదేశాలు ఈ విపత్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రానున్న రోజులు మరిన్ని దాడులు జరిగే అవకాశం లేకపోలేదని ముందస్తుగా హెచ్చరించారు.


Next Story

Most Viewed