- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్టిగా కారులో గుట్కా.. స్మగ్లర్‌కు పోలీసుల షాక్
by Sridhar Babu |
<p>దిశ, మల్లాపూర్: మల్లాపూర్ మండలం హుస్సేన్‌నగర్‌లో అక్రమ గుట్కా రవాణా వ్యవహారం బయటపడింది. సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఓ కారు అనుమానాస్పదంగా రావడం గమనించాడు. కారు ఆపి తనిఖీ చేయగా నిషేధిత గుట్కాను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. గుట్కా తరలిస్తున్న వ్యక్తి ఖానాపూర్ మండలానికి చెందిన నవాత్ సతీష్ (26)గా పోలీసులు తేల్చారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. […]</p>

X
దిశ, మల్లాపూర్: మల్లాపూర్ మండలం హుస్సేన్‌నగర్‌లో అక్రమ గుట్కా రవాణా వ్యవహారం బయటపడింది. సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఓ కారు అనుమానాస్పదంగా రావడం గమనించాడు. కారు ఆపి తనిఖీ చేయగా నిషేధిత గుట్కాను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామని ఎస్ఐ రాజేందర్ తెలిపారు. గుట్కా తరలిస్తున్న వ్యక్తి ఖానాపూర్ మండలానికి చెందిన నవాత్ సతీష్ (26)గా పోలీసులు తేల్చారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మల్లాపూర్ మండలంలో గుట్కా నిర్మూలన మండలంగా పేరొందాలని ఆకాంక్షించారు. ఏ గ్రామంలోనైనా గుట్కా విక్రయాలు జరిపితే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






