టీఎస్‌పీఎస్సీని ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు

by Shyam |   (  Updated:2021-09-02 02:50:57  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. నోటిఫికేషన్ వేస్తున్నామని చెప్పి నెలలు గడుస్తున్నా.. ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో నిరుత్సాహపడి ఉద్యమానికి సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం గురుకుల పీఈటీ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. పీఈటీ ఫలితాలు వెంటనే విడుదల చేసి, నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘‘ఉద్యోగాలైనా ఇవ్వండి.. లేదంటే కారుణ్య నియామకాలకైనా అనుమతినివ్వండి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. [&hellip;]</p>

Gurukula PET candidates
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. నోటిఫికేషన్ వేస్తున్నామని చెప్పి నెలలు గడుస్తున్నా.. ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో నిరుత్సాహపడి ఉద్యమానికి సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం గురుకుల పీఈటీ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. పీఈటీ ఫలితాలు వెంటనే విడుదల చేసి, నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘‘ఉద్యోగాలైనా ఇవ్వండి.. లేదంటే కారుణ్య నియామకాలకైనా అనుమతినివ్వండి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. టీఎస్పీఎస్సీ ఆలస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story