- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్‌లో కేసీఆర్‌కి షాక్.. గల్ఫ్ బంధు అమలు చేయాలని డిమాండ్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు తరహాలోనే గల్ఫ్ వాపసీల కోసం గల్ఫ్ బంధు అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన వారి కోసం ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతున్నారు. గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్ రిటర్న్ అయిన వారు హాజరు […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు తరహాలోనే గల్ఫ్ వాపసీల కోసం గల్ఫ్ బంధు అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన వారి కోసం ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతున్నారు. గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్ రిటర్న్ అయిన వారు హాజరు కానున్నారు. ఉన్న ఊళ్లో ఉపాధి లేక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అప్పుల పాలైన వారిని ఆదుకోవాలన్న డిమాండ్ వినిపించాలని ఈ సంఘం నిర్ణయించింది. గల్ప్ వర్కర్స్ చే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నిర్వహకులు మంద బీం రెడ్డి తెలిపారు. గల్ప్ కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా గల్ఫ్ బంధు పథకం అమలు చేయాలని కోరుతున్నామన్నారు.






