డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’గా మార్చిన బీజేపీ

127

దిశ,వెబ్‌డెస్క్: డ్రాగన్ ఫ్రూట్ పేరు మారింది. డ్రాగన్ ఫ్రూట్ పేరు కాస్త ‘కమలం’ గా మారింది. గులాబీ రంగులో ఎట్రాక్టీవ్ గా కనిపించే ఈ పండు తినడం వల్ల మనశరీరానికి అనేక లాభాలున్నాయి. విటమిన్ సి, అరుగదలతో పాటు బరువు తగ్గాలనుకునే వారు డాక్టర్ సలహాలతో ఇ పండును తింటుంటారు. అందుకే ఈ ఫ్రూట్ ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ పండును గుజరాత్ ప్రభుత్వం కమలం’గా పేరు మారుస్తూ పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఈ సందర్భంగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ ఆ పేరు ఎందుకో నచ్చలేదు. కాబట్టే పేరు మార్చాం. డ్రాగన్ ఫ్రూట్ కమలం ఆకారంలోనే ఉంటుంది. కమలం సంస్కృత పదమని… అందుకే దానికి ఆ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..