- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం కేశుభాయి పటేల్ కన్నుమూత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ (92) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కేశూభాయి పటేల్ రెండు సార్లు సీఎంగా ఉన్నారు. 1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1978-1980 మధ్యలో వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 7 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ (92) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కేశూభాయి పటేల్ రెండు సార్లు సీఎంగా ఉన్నారు.
1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1978-1980 మధ్యలో వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 7 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1998 మార్చి నెలలో మరోసారి సీఎం పదవిని చేపట్టి.. అనారోగ్య కారణాల దృష్ట్యా 2001లో పదవికి రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యం కారణంగా కేశూభాయి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Next Story






