గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల..

by  |
Jobs
X

దిశ, సదాశివనగర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ భానుమతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పాఠశాలలో పీజీటీ ఇంగ్లీష్, జువాలజీ, తెలుగు, టీజీటీ హిందీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అప్లికేషన్ చేయాలనుకునే అభ్యర్థులు పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు. మంగళవారం నేరుగా పాఠశాలలో దరఖాస్తు చేసుకుని డెమో తరగతులకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 83746 77940 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.


Next Story