తిరుపతి ఉపఎన్నిక వేళ వైసీపీకి భారీ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-02 06:29:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వేళ అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని. హరిశ్చంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గూడూరు ప్రజలకు సేవ చేస్తానన్నారు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయని, పార్టీ కోసం శ్రమిస్తుున్న తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి [&hellip;]</p>

తిరుపతి ఉపఎన్నిక వేళ వైసీపీకి  భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వేళ అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత కనుమూరి హరిశ్చంద్ర రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని. హరిశ్చంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గూడూరు ప్రజలకు సేవ చేస్తానన్నారు.

పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయని, పార్టీ కోసం శ్రమిస్తుున్న తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి పొరపాటున వచ్చానని, రాజకీయాలకు తాను కరెక్ట్ కాదన్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన వైసీపీ కార్యకర్తలు. అభిమానులకు హరిశ్చంద్రరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి ఉపఎన్నిక క్రమంలో హరిశ్చంద్రరెడ్డి రాజీనామా చేయడం వైసీపీ వర్గాలను షాక్‌కు గురి చేసింది.

Next Story