అలర్ట్.. రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్-19 ఆర్ ఫ్యాక్టర్..

by  |
Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ కేసులను అంచనా వేసే కొవిడ్-19 ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతుండటం ఆందోళన కలిస్తోంది. రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 0.8 నుంచి 0.95 వరకు నమోదువుతున్నట్టుగా వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఆర్ ఫ్యాక్టర్ 1కి పైగా నమోదవుతే వైరస్‌ను అదుపు చేయడం కష్టమవుతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు సెకండ్ వేవ్‌లో ఏప్రిల్ నెలలో ఆర్ ఫ్యాక్టర్ అత్యధికంగా 1.37 నమోదైంది.

కరోనా వ్యాధి బారిన పడిన ఒక వ్యక్తి ఎంత మందికి వైరస్‌ను వ్యాప్తి చేస్తాడనే అంశాన్ని శాస్రవేత్తలు ఆర్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ధారించారు. కొవిడ్-19 ఆర్ ఫ్యాక్టర్ 1కంటే ఎక్కువగా ఉంటే ఒక వ్యక్తి 100 మంది వరకు వైరస్‌ను వ్యాప్తి చేయగలుగుతున్నాడని అంచనాలు వేశారు. మే నెల చివరి వరకు తగ్గుముఖం పట్టిన కొవిడ్-19 ఆర్ ఫ్యాక్టర్ క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా నమోదువుతున్న కేసులను పరిశీలించి అధ్యయనాలు చేపట్టిన చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమిటికల్ సైన్సెస్ ఆర్ ఫ్యాక్టర్ తీవ్రతను నమోదు చేశారు. జూలై 30 వరకు దేశంలో ఆర్ ఫ్యాక్టర్ 1.01గా గుర్తించామని ప్రకటించారు. 1కి పైగా ఆర్ ఫ్యాక్టర్ నమోదవుతుండటంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో 0.8 నుంచి 0.95 వరకు ఆర్ ఫ్యాక్టర్..

రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను బట్టి వైద్య నిపుణులు ఆర్ ఫ్యాక్టర్‌ను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, ప్రైవేటు ఆసుప్రతుల్లో చేరుతున్న కొవిడ్ పేషెంట్ల సంఖ్య బట్టి రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 0.8 నుంచి 0.95 వరకు పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతుండటంతో మరిన్ని కేసులు నమోదుకానున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న ఏప్రిల్ నెలలో ఆర్ ఫ్యాక్టర్ అత్యధికంగా 1.37గా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచ‌నా వేశారు.


Next Story