హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయండి

by Shyam |

<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం(కేవీకే)కి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్‌ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సీఎం కేసీఆర్‌ను కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ రఘోత్తం రెడ్డి 160 ఎకరాల భూమిని, రూ.1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎంకు వివరించారు. దీనికి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే [&hellip;]</p>

హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయండి
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం(కేవీకే)కి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్‌ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సీఎం కేసీఆర్‌ను కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ రఘోత్తం రెడ్డి 160 ఎకరాల భూమిని, రూ.1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎంకు వివరించారు. దీనికి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. నాలుగురోజుల క్రితం రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవీకేను సందర్శించి, నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభిద్దామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story