బయో ఏషియా సదస్సు ప్రారంభం..

by Shamantha N |

<p>తెలంగాణలోని హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సుకు 37దేశాల నుంచి 800 కంపెనీలు విచ్చేయగా, 2000 మంది దేశవిదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. అంతేకాకుండా బయోఏషియా సదస్సులో 75 అంకుర కంపెనీలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సదస్సు మూడు రోజులు కొనసాగనుంది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఆసియాలోనే లైఫ్ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఫార్మాకేంద్రం అవశ్యకతను కేంద్ర ప్రభుత్వం [&hellip;]</p>

బయో ఏషియా సదస్సు ప్రారంభం..
X

తెలంగాణలోని హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సుకు 37దేశాల నుంచి 800 కంపెనీలు విచ్చేయగా, 2000 మంది దేశవిదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. అంతేకాకుండా బయోఏషియా సదస్సులో 75 అంకుర కంపెనీలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సదస్సు మూడు రోజులు కొనసాగనుంది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఆసియాలోనే లైఫ్ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఫార్మాకేంద్రం అవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని వివరించారు. ప్రపంచంలో తయారయ్యే మెడిసిన్‌లో మూడో వంతు మెడిసిన్ హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తవుతోందని కొనియాడారు. జాతీయ ఫార్మా ఉత్పత్తి రంగంలో నగరం వాటా 35శాతంగా ఉందని సదస్సులో మంత్రి కేటీఆర్ తెలిపారు.

Next Story