- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రాడ్యుయేట్లు డబ్బులకు అమ్ముడుపోరు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాడ్యుయేట్లు డబ్బులకు అమ్ముడుపోరని, చిన్నారెడ్డికి మంచి స్పందన వస్తోందని, మండలిలో బలమైన నాయకుడిగా నిలుస్తారని పట్టభ్రదులు నమ్ముతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లలో 55 శాతం మంది ఓటర్లు చిన్నారెడ్డికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్ రావు సమర్థవంతంగా పనిచేయలేదని, అందుకే ఇప్పుడు ప్రచారంలో వారికి నిరసనలు ఎదురవుతున్నాయని తెలిపారు. విభజన […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాడ్యుయేట్లు డబ్బులకు అమ్ముడుపోరని, చిన్నారెడ్డికి మంచి స్పందన వస్తోందని, మండలిలో బలమైన నాయకుడిగా నిలుస్తారని పట్టభ్రదులు నమ్ముతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లలో 55 శాతం మంది ఓటర్లు చిన్నారెడ్డికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్ రావు సమర్థవంతంగా పనిచేయలేదని, అందుకే ఇప్పుడు ప్రచారంలో వారికి నిరసనలు ఎదురవుతున్నాయని తెలిపారు. విభజన హామీలను నెరవేర్చని బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ నాయకుడైన పీవీ నరసింహారావు ఫొటోను ముందుంచి ఓట్లు అడగడం మొదలెట్టినప్పుడే టీఆర్ఎస్ పతనం కూడా ప్రారంభమైందని తెలుస్తోందన్నారు.
Next Story






