జీఎస్టీ ఫైలింగ్ లేట్‌ఫీజును మాఫీ చేసిన ప్రభుత్వం!

by  |
జీఎస్టీ ఫైలింగ్ లేట్‌ఫీజును మాఫీ చేసిన ప్రభుత్వం!
X

దిశ, వెబ్‌డెస్క్: నెలవారీ రిటర్న్ జీఎస్టీఆర్-3బీ, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి పన్ను చెల్లింపులపై లేట్ ఫీజును ప్రభుత్వం మాఫీ చేసింది. అంతేకాకుండా ఆలస్యంగా చెల్లించే వారికి వడ్డీని తగ్గించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులు జీఎస్టీఆర్-3బీ, పన్ను చెల్లించడానికి 15 రోజుల అదనపు సమయాన్ని కల్పించింది. ఈ 15 రోజులకు వారు చెల్లించే పన్నులపై వడ్డీని 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. రూ. 5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వ్యాపారులు 3బీ రిటర్నులకు లేట్ ఫీజు మినహాయింపుతో 30 రోజుల గడువు ఇచ్చింది.

వడ్డీ రేటు తొలి 15 రోజులు ఉండదు. ఆ తర్వాత 9 శాతం, 30 రోజుల తర్వాత 18 శాతం వడ్డీ విధించబడుతుంది. ఈ సడలింపులు ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వస్తాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే, ఏప్రిల్ సేల్స్ రిటర్న్ జీఎస్‌టీఆర్1 దాఖలు చేయవలసిన తేదీని మే 26 వరకు పొడిగించారు. కంపోజిషన్ డీలర్లకు ఈ ఏడాది మార్చి 31 నాటికి చేయాల్సిన ఫైలింగ్ గడువును మే 31కి పెంచారు. కరోనా అత్యవసర పరిస్థితుల కారణంగా ఈ ఉపశమనం కల్పించినట్టు, కార్యకలాపాల పరిమాణంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడు కొంత సమయం పొడిగింపునకు అర్హులని ఏఎంఆర్‌జీ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ చెప్పారు.


Next Story

Most Viewed