ధరల పెరుగుదలపై కేంద్రం కీలక సమీక్ష!

by  |
India Exports
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పెరుగుతున్న పలు వస్తువుల ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. దేశీయంగా దిగుమతి అవుతున్న పలు వస్తువులపై కస్టమ్స్ మినహాయింపు ఇచ్చేందుకు సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. దీనిపై అభిప్రాయాలను ఇవ్వాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరింది. దిగుమతిదారులు, ఎగుమతిదారులతో పాటు దేశీయంగా ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంఘాల నుంచి సూచనలు, సలహాలను ఇవ్వాలని కేంద్రం అభ్యర్థించింది. ఆగష్టు 10వ తేదీలోగా ప్రభుత్వం వెబ్‌సైట్‌లో సలహాలివ్వాలని ప్రకటించింది.

కేంద్రం తీసుకున్న కొత్త చర్యలతో దుస్తులు, ఇంటర్నెట్ పరికరాలు, గర్భనిరోధకాలు, రికార్డింగ్ పరికరాలు, వస్త్ర పరిశ్రమ యంత్రాలు, ఫోటోగ్రఫీ పరికారాలు, క్రీడా సామగ్రి, సెట్‌టాప్ బాక్సుల ధరలు దిగిరానున్నాయి. అవసరమైన సంప్రదింపులు జరిగిన తర్వాత ఇప్పుడున్న కస్టమ్స్ మినహాయింపులను సమీక్షించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. దీనిపై కేంద్ర కస్టమ్స్, పరోక్ష పన్నుల బొర్డు కసరత్తు చేసింది. మారుతున్న కాలానుగుణంగా కస్టమ్స్ చట్టాలను, విధానాలను ప్రభుత్వం సమీక్షిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధి అభిషేక్ జైన్ చెప్పారు. దీనివల్ల వ్యాపారాలను నిర్వహినడం సులభతరం అవుతుందని, తాజా కస్టమ్స్ జాబితా వలన మరిన్ని రంగాలకు ప్రయోజనాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed