రైతు రుణాలు ఇవ్వాలి.. బీసీ సేన డిమాండ్..

by  |
BC Federation
X

దిశ, జడ్చర్ల : బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్ ద్వారా రైతు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ రాయితీ రుణాలు అందించాలని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం జడ్చర్లలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తరాలు పంపించారు. ఈ సందర్భంగా బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. 2015-16లో బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్‌ల ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాయితీ రుణాలు అందించకముందే 2018లో ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 190 జిఓ ద్వారా బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్‌లను రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015-16, 2017-18 సంవత్సరాలలో మొత్తం 5.7 లక్షల మంది రైతులు రుణాలకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 30వేల మందికి రూ.50 వేల చొప్పున చెక్కులు అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అయినా రుణాలు అందుతాయని అభ్యర్థులు ఆశించారని, కానీ ప్రభుత్వం మాత్రం మరోసారి వారికి మొండి చెయ్యి చూపిందని వారు అన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాయితీ రుణాలు అందించి ఉపాధి కల్పించాలని, బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 2017 డిసెంబర్‌లో బీసీ ప్రజాప్రతినిధులతో మూడు రోజులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికై 215 పాలసీలు రూపొందించామని ప్రకటించిన ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదని, తక్షణమే ఆ పాలసీలను కూడా అమలు పరచాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పోస్టుకార్డు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సేన మండల అధ్యక్షుడు మండ్ల స్వామి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లింగంపేట శేఖర్, జిల్లా కార్యదర్శి కంచన్ పల్లి చెన్నయ్య, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గౌరీశంకర్, నెక్కొండ ఆచారి, మాచారం శ్రీను, నిరంజన్, చాపల శ్రీనివాసులు,కట్ట మురళి,హరీష్,శివ, హైమద్ తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed