ఐపీఎం కేంద్రంలో రక్తం సేకరణ

by Shyam |

<p>దిశ, హైదరాబాద్: దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో దాతల నుంచి రక్త సేకరణ నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలు చేయాల్సిన వారికి, నెలలో తప్పనిసరిగా రెండు సార్లు రక్తం ఎక్కించాల్సిన తలసీమియా బాధితులకు కావాల్సిన రక్తం అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులకు సైతం సరిపడా రక్తం లేకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో రక్తం సేకరించాలని ప్రభుత్వం [&hellip;]</p>

ఐపీఎం కేంద్రంలో రక్తం సేకరణ
X

దిశ, హైదరాబాద్: దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో దాతల నుంచి రక్త సేకరణ నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలు చేయాల్సిన వారికి, నెలలో తప్పనిసరిగా రెండు సార్లు రక్తం ఎక్కించాల్సిన తలసీమియా బాధితులకు కావాల్సిన రక్తం అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులకు సైతం సరిపడా రక్తం లేకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో రక్తం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 100 నుంచి 115 యూనిట్లు సేకరించాలని భావిస్తోంది. వీటిని మరింత విశ్లేషించి వేర్వేరు కాంపొనెంట్లుగా సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు.. సంబంధిత రక్త నిధి కేంద్రాల అభ్యర్థన మేరకు ఈ యూనిట్లను పంపేందుకు చర్యలు చేపట్టనుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 1625 మంది తలసీమియా బాధితులు వున్నారు. ఈ మేరకు ఐపీఎం డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారులు ఈ బాధ్యతలు చూడనున్నారు. రక్త దాతలు, రక్త గ్రహీతలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 84979 58597, 040- 2956 9047 నంబర్లలో సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.

Tags: IPM, blood collection, Corona, Emergency situations

Next Story