కరోనా టెస్టులకు రూ. 4,500లకు ఎక్కువ తీసుకోవద్దు

by  |
కరోనా టెస్టులకు రూ. 4,500లకు ఎక్కువ తీసుకోవద్దు
X

న్యూఢిల్లీ : కరోనావైరస్(కోవిడ్ 19) పరీక్షలు నిర్వహించే ప్రైవేటు ల్యాబరేటరీలు వసూలు చేసే ఫీజులకు కేంద్రం పరిమితి విధించింది. ఈ టెస్టులు నిర్వహించినందుకు రూ. 4,500లకు మించి తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అనుమానితుల స్క్రీనింగ్ టెస్టు కోసం రూ. 1,500, వైరస్ ధ్రువీకరణ టెస్టు కోసం రూ. 3,000ల వరకు ఫీజు తీసుకోవచ్చని నేషనల్ టాస్క్ ఫోర్స్ రికమెండ్ చేసింది. కాగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మాత్రం.. జాతీయ ఆరోగ్య విపత్తు నెలకొన్న ఈ సమయంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని, లేదా తక్కువ ఫీజులు తీసుకోవాలని సూచించింది. ఈ సూచనలను ధిక్కరించినవారు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ కేంద్రం హెచ్చరించింది. రియల్ టైమ్ పీసీఆర్ ఎస్ఏ కోసం ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లన్నీ ఈ టెస్టు నిర్వహించేందుకు అర్హమైనవని ఐసీఎంఆర్ పేర్కొంది.

Tags: coronavirus, tests, laboratories, private, fee, cost, limit, centre, ICMR


Next Story