అమ్మాయిలతో అంకుల్స్ డ్యాన్స్‌లు అంటూ… హీరోల ఏజ్‌పై సోషల్ మీడియాలో వార్

by  |
అమ్మాయిలతో అంకుల్స్ డ్యాన్స్‌లు అంటూ…  హీరోల ఏజ్‌పై సోషల్ మీడియాలో వార్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు గోవింద ఇటీవల తన మ్యూజిక్ వీడియో ‘టిప్ టిప్ బార్సా పానీ’తో అభిమానులను అలరించాడు. తాజాగా మరో సాంగ్‌ ప్రోమోను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ‘చష్మా చద్దా కే’ అనే ఈ మ్యూజిక్ వీడియోలో గోవిందకు జోడీగా షనయా కౌర్ నటించింది. ఈ నెల 6న ఫుల్ సాంగ్‌ విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

ఈ పాట చాలా బాగుందని, త్వరగా రిలీజ్ చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుతుంటే.. మరికొందరు గోవిందపై ట్రోలింగ్‌కు దిగారు. ఈ పాటలో తనతో నటించిన షనయా వయసును ప్రస్తావిస్తూ.. ‘గోవింద అంకుల్.. అంత చిన్నమ్మాయితో డ్యాన్స్ ఏంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతున్న గోవింద ఫ్యాన్స్.. ‘షారుఖ్, సల్మాన్, అక్షయ్ చేస్తే తప్పులేదు గానీ ఈయన చేస్తేనే మీకు నచ్చట్లేదా? ఏం.. వాళ్లేమైనా కుర్రాళ్లా?’ అని కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక గోవింద చివరిసారిగా 2019లో వచ్చిన ‘రంగీలా రాజా’ మూవీలో కనిపించాడు.

LICలో ఏ పాలసీ మంచిదో తెలుసా..? ఆ బీమాతో బెనిఫిట్స్ ఎక్కువేనట!


Next Story

Most Viewed