ఆదిలాబాద్‌లో గవర్నర్ తమిళసై పర్యటన రద్ధు

by Chintha Aamani |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. కానీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై జిల్లా పర్యటన రద్దు అయ్యింది. గవర్నర్ ప్రయాణించనున్న హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ రోజు గవర్నర్ జిల్లాలో పర్యటించి, అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించే జనజాతి గౌరవ [&hellip;]</p>

ఆదిలాబాద్‌లో గవర్నర్ తమిళసై పర్యటన రద్ధు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. కానీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై జిల్లా పర్యటన రద్దు అయ్యింది. గవర్నర్ ప్రయాణించనున్న హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ రోజు గవర్నర్ జిల్లాలో పర్యటించి, అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించే జనజాతి గౌరవ దినోత్సవ వేడుకలో పాల్గొనాల్సి ఉండే.. అయితే గవర్నర్ పర్యటన రద్దు అయినప్పటికీ జనజాతి గౌరవ దినోత్సవ వేడుకలు యధావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపినట్టు సమాచారం.

Next Story