గిరిజన తండాలో సెకండ్ డోస్ తీసుకున్న గవర్నర్

by  |
గిరిజన తండాలో సెకండ్ డోస్ తీసుకున్న గవర్నర్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గిరిజన తండాలపై అమితమైన ప్రేమ ఉందని గవర్నర్ తమిళ సై అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసి తండాలో గవర్నర్ కొవిడ్ సెకండ్ డోస్ గిరిజనులతో కలిసి వేసుకున్నారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో శివగంగ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసి తండాలో పల్లె ప్రకృతి వనంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషితో దేశంలోని 130 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గిరిజన తండాల్లో అపోహలు పోగట్టడానికే కేసి తండాను ఎంపిక చేసుకున్నమని గవర్నర్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed