- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుదుచ్చేరిలో ఉన్నా ధ్యాసంతా తెలంగాణపైనే : తమిళిసై
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యత అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తమిళిసై శుక్రవారం పుదుచ్చేరి నుంచి తెలంగాణ రాష్ట్ర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుంచి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ రాజ్ భవన్ అధికారులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అంశాలకు సంబంధించిన వివిధ విషయాలపై సమీక్ష చేశారు. గవర్నర్ మాట్లాడుతూ తాను పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యత అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తమిళిసై శుక్రవారం పుదుచ్చేరి నుంచి తెలంగాణ రాష్ట్ర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుంచి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ రాజ్ భవన్ అధికారులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అంశాలకు సంబంధించిన వివిధ విషయాలపై సమీక్ష చేశారు. గవర్నర్ మాట్లాడుతూ తాను పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే తన ధ్యాస ఉంటుందన్నారు. రాజ్‌భవన్ అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని, అవసరమైన విషయాలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాజ్‌భవన్ నుంచి గవర్నర్ సలహాదారులు, జాయింట్ సెక్రటరీలు, ఇతర అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Next Story






