అపోహలు వద్దు.. అందరూ టీకా వేసుకోవాలి : గవర్నర్

58

దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్​వ్యాక్సినేషన్​పై అపోహలు అనరసవరమని తెలంగాణ గవర్నర్ ​తమిళసై అన్నారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరులో పద్మావతి అమ్మవారు, తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్నారు. సమ్మేళనంలో తమిళిసై మాట్లాడుతూ.. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు విడనాడి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుంచి రక్షణ పొంది ఆరోగ్యంగా ఉండాలని తమిళసై ఆకాంక్షించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..