హవల్దార్ కుటుంబానికి అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్

by Shyam |

<p>దిశ,వెబ్‌డెస్క్: హవల్దార్ పరశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హవల్దార్ పరశురాం భౌతిక కాయం శంషాబాద్ విమానాశ్రయానికి శనివారం చేరుకుంది. పరశురాం భౌతిక కాయానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ&#8230; రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. మహబూబ్ నగర్‌లో రెండు పడకల ఇండ్లు అందజేస్తామని తెలిపారు. సైనిక [&hellip;]</p>

హవల్దార్ కుటుంబానికి అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్
X

దిశ,వెబ్‌డెస్క్: హవల్దార్ పరశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హవల్దార్ పరశురాం భౌతిక కాయం శంషాబాద్ విమానాశ్రయానికి శనివారం చేరుకుంది. పరశురాం భౌతిక కాయానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు.

మహబూబ్ నగర్‌లో రెండు పడకల ఇండ్లు అందజేస్తామని తెలిపారు. సైనిక సంక్షేమ నిధి నుంచి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. పరశురాం కుటుంబానికి కేంద్రం పరిహారం అందించాలని కోరారు. కాగా లడ్డాఖ్‌లోని లేహ్‌లో పనిచేస్తూ ప్రమాదవ శాత్తు పరశురాం అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. పరశురాం స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వని కుంట తాండ.

Next Story