- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కోనప్పను ఫాలో అవుతున్న సర్కార్
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేపడుతున్న కార్యక్రమ ప్రభావమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు కోనప్ప అమలు చేస్తున్న కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే శుక్రవారం సీఎం […]</p>

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేపడుతున్న కార్యక్రమ ప్రభావమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు కోనప్ప అమలు చేస్తున్న కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే శుక్రవారం సీఎం కేసీఆర్ సిర్పూర్ శాసనసభ్యుడు కోనప్పకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చెబుతున్నారు. దీనికి కారణం చూస్తే… గత ఏడాది నుంచి ఎమ్మెల్యే కోనప్ప తన సొంత డబ్బులతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. కోనప్ప ఆచరిస్తున్న కార్యక్రమం తాజాగా ప్రభుత్వ ఆలోచనగా మారడం గమనార్హం. తాను మారుమూల అటవీ ప్రాంత నియోజకవర్గమైన సిర్పూర్ కాగజ్ నగర్ పేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నానని… దీన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్రమంతటా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కోనప్ప వ్యాఖ్యానించారు.






