- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో అంతరాష్ర్ట బస్సులకు గ్రీన్ సిగ్నల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు నడపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఎవరైతే ఏపీకి రావాలనుకుంటున్నారో అందరినీ తీసుకొచ్చేందుకు బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్టాండ్ టూ బస్టాండ్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. మధ్యలో ఎవర్నీ ఎక్కించుకోరు. సామాజిక దూరం నేపథ్యంలో బస్సులో కేవలం 20 మంది మాత్రమే కూర్చునే వెసులుబాటు కల్పించనున్నారు. బస్సులో ఎక్కినవారి పూర్తి వివరాలు తీసుకునే సీట్లు కేటాయించనున్నారు. బస్సు దిగగానే వారికి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు నడపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఎవరైతే ఏపీకి రావాలనుకుంటున్నారో అందరినీ తీసుకొచ్చేందుకు బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్టాండ్ టూ బస్టాండ్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. మధ్యలో ఎవర్నీ ఎక్కించుకోరు. సామాజిక దూరం నేపథ్యంలో బస్సులో కేవలం 20 మంది మాత్రమే కూర్చునే వెసులుబాటు కల్పించనున్నారు. బస్సులో ఎక్కినవారి పూర్తి వివరాలు తీసుకునే సీట్లు కేటాయించనున్నారు. బస్సు దిగగానే వారికి తనిఖీలు చేయనున్నారు. ఈ మేరకు విధివిధానాలు సిద్ధం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ప్రైవేటు బస్సులను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story






