మంత్రి ఈటలకు గవర్నర్ ఫోన్.. ఏం మాట్లాడరంటే!

by  |
మంత్రి ఈటలకు గవర్నర్ ఫోన్.. ఏం మాట్లాడరంటే!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం తాజాగా ఐదు విధానాల ద్వారా కరోనాను కట్టడి చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టెస్ట్, ట్రేస్, ట్రీట్, కొవిడ్ రూల్స్, వ్యాక్సినేషన్ మొదలగు వాటిని కఠినతరం చేయాలని ఆదేశించింది. తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌తో ఫోన్ లో సంభాషించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ ఆరా తీశారు. కేసులు పెరుగుతుండటంపై తమిళి సై ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్, నియంత్రణ చర్యలు, టెస్టుల వివరాలు, క్వారంటైన్ సెంటర్ల గురించి మంత్రి ఈటలను గవర్నర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.


Next Story