- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడేళ్ల అజ్ఞాతం తర్వాత ప్రజల్లోకొచ్చారు
by Shamantha N |
<p>కోల్‌కతా: మూడేళ్ల అజ్ఞాతం తర్వాత గోర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) లీడర్ బిమర్ గురుంగ్ బుధవారం ప్రత్యక్షమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని గోర్ఖా భవన్‌లో విలేకరుల సమావేశంలో ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. గోర్ఖాలాండ్ ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ నిలుపుకోలేదని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి మద్దతునివ్వనున్నట్టు తెలిపారు. గోర్ఖాలాండ్ డిమాండ్‌కు కట్టుబడే ఉన్నారని, తమ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లే పార్టీకి మద్దతునిస్తామని అన్నారు. 2017లో ఉపా కేసు నమోదైనప్పటి […]</p>

X
కోల్‌కతా: మూడేళ్ల అజ్ఞాతం తర్వాత గోర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) లీడర్ బిమర్ గురుంగ్ బుధవారం ప్రత్యక్షమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని గోర్ఖా భవన్‌లో విలేకరుల సమావేశంలో ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. గోర్ఖాలాండ్ ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ నిలుపుకోలేదని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి మద్దతునివ్వనున్నట్టు తెలిపారు. గోర్ఖాలాండ్ డిమాండ్‌కు కట్టుబడే ఉన్నారని, తమ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లే పార్టీకి మద్దతునిస్తామని అన్నారు. 2017లో ఉపా కేసు నమోదైనప్పటి నుంచి గురుంగ్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
Next Story






